Bill Gates Melinda Gates Divorce : ప్రేమించి చేసుకుని.. 27 ఏళ్లు అయ్యాక విడాకులు || Oneindia Telugu

2021-05-04 38

Bill and Melinda Gates divorce after 27 years of marriage
#Billgates
#MelindaGates
#Microsoft

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ఆయన ఆస్తి 124 బిలియన్ డాలర్లు. ఇందులో కొంత మొత్తాన్ని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ కోసం కేటాయించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేద దేశాలకు సహాయ, సహకారాలను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈ ఫౌండేషన్ కీలకపాత్ర పోషిస్తోంది. 2000లో స్థాపించిన ఈ ఫౌండేషన్‌కు మెలిండా ఛైర్‌పర్సన్. 43.3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఈ ఫౌండేషన్‌కు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో గత ఏడాది బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ బోర్డ్ నుంచి తప్పుకొన్నారు.